డై హార్డ్ ఫ్యాన్ కల నెరవేర్చిన అల్లు అర్జున్!

తమ అభిమాన హీరో కోసం ఎంత వరకు అయినా వెళ్లగలిగే ఫ్యానిజం మన తెలుగు ఆడియెన్స్ సొంతం. అలాగే వారు హ్యాపీగా ఉండాలనే వారి హీరోలు కూడా ఎంతో తాపత్రయం పడుతుంటారు. అలాగే వారి కోసమే ఎంత కష్టమైనా తీసుకుంటారు. అలా ఏంత్తో హార్డ్ చేసి డై హార్డ్ ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్న టాప్ హీరోల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకరు.

అయితే అల్లు అర్జున్ కు వీరాభిమాని అయినటువంటి పి నాగేశ్వర రావు మాచర్ల నుంచి తన అభిమాన హీరో అల్లు అర్జున్ కు కలిసేందుకు 200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి కలవాలని పూనుకున్నాడు. గత రెండు వారాల కితమే అతడు కటిక వర్షంలో కూడా ఆగకుండా నడిచాడు.

మొత్తానికి ఇపుడు బన్నీ ఆ అభిమానిని కలిసి అతడి కల నెరవేర్చాడు.బన్నీ మూడిటి సినిమా నుంచి ఇప్పటికీ వీరాభిమాని అయినటువంటి నాగేశ్వర రావును తన ఆఫీస్ లో బన్నీ అతన్ని కలిసి యోగ క్షేమాలు కనుక్కొని అతనికి అంతులేని ఆనందాన్ని ఇచ్చాడు. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు భారీ పాన్ ఇండియన్ చిత్రాల్లో నటిస్తున్నారు.

Exit mobile version