విశాఖలో స్టూడియో ప్రారంభించనున్న మెగాస్టార్

విశాఖలో స్టూడియో ప్రారంభించనున్న మెగాస్టార్

Published on Oct 22, 2012 2:00 PM IST


సినిమా పరిశ్రమ మరియు హైదరాబాద్ లది విడదీయలేని సంబంధం దాదాపు అన్ని చిత్రాలు ఇక్కడే చిత్రీకరణ జరుపుకోవడం ఇదే కాకుండా ఇక్కడే పలు ప్రముఖ స్టూడియోలు ఉండటం కూడా దీనికి కారణం. రామోజీ ఫిలిం సిటీ, రామానాయుడు స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ ఇక్కడే ఉండటంతో దాదాపుగా చిత్రీకరణలు మొత్తం హైదరాబాద్లోనే జరుగుతున్నాయి కాని ఈ మధ్య తెలంగాణా ఉద్యమం మూలాన ఏర్పడిన అడ్డంకులతో సినిమా పరిశ్రమ వారు కొత్త ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్నారు. ఇప్పటికే విశాఖలో పలు చోట్ల అవుట్ డోర్ షూటింగ్ జరుగుతుండటంతో అక్కడ స్టూడియోస్ ఓపెన్ చెయ్యడానికి ఉత్సాహం చుపుస్తున్నారు. ప్రస్తుతం అక్కడ రామానాయుడు స్టూడియోస్ మాత్రమే ఉంది. విశాఖలో స్టూడియో పెట్టడానికి పలువురు అనుమతి కోరుతున్నారని మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. ఈ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు అని త్వరలో అయన విశాఖలో స్టూడియో ఓపెన్ చేయ్యనున్నారని ఆయన అన్నారు. ఇలా మరో ప్రత్యామ్నాయం ఉండటం చిత్ర పరిశ్రమకు మంచి చేసే విషయమే.

తాజా వార్తలు