ఫోటో మూమెంట్: ‘పెద్ది’ స్టార్ తో ‘కే ర్యాంప్’ హీరో

ఫోటో మూమెంట్: ‘పెద్ది’ స్టార్ తో ‘కే ర్యాంప్’ హీరో

Published on Oct 25, 2025 5:04 PM IST

K-ramp

లేటెస్ట్ గా ఈ దీపావళి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన అవైటెడ్ చిత్రాల్లో ఒకటే కే ర్యాంప్. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ఈ సినిమా అంచనాలు అందుకొని సాలిడ్ వసూళ్లు అందుకుంది. ఇలా స్టడీ వసూళ్లు రాబడుతున్న ఈ సినిమా హీరో లేటెస్ట్ గా పెద్ది నటుడు శివ రాజ్ కుమార్ ని కలవడం జరిగింది.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చి బాబు సానాతో చేస్తున్న ఈ సినిమాలో తను సాలిడ్ రోల్ చేస్తుండగా ఈ నటుడుతో కిరణ్ అబ్బవరం కలిసి షేర్ చేసుకున్న పిక్ వైరల్ గా మారింది. మరి శివన్న అందించిన అభినందనలకి ధన్యవాదాలు తను తెలియజేశాడు. ఇక పెద్ది సినిమా ప్రస్తుతం ఓ సాంగ్ షూట్ లో ఉండగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు