ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మొత్తం మూడు భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వీటిలో లేటెస్ట్ అనౌన్స్ చేసిన భారీ ప్రాజెక్ట్ “ఆదిపురుష్”. దర్శకుడు ఓం రౌత్ ప్రకటించిన ఈ పౌరాణిక ఇతిహాస చిత్రంలో ప్రభాస్ రామునిగా కనిపించనున్నారని ఇప్పటికే సర్క్యూలేట్ అవుతున్న బజ్ అలాగే దీనితో పాటుగా ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసిన రోజు నుంచే మరో స్ట్రాంగ్ ఎలిమెంట్ ను కూడా మేకర్స్ తెలిపారు.
ఈ చిత్రంలో ప్రతినాయకుని పాత్రలో బాలీవుడ్ కు చెందిన ఒక స్టార్ హీరో చేయనున్నారని ఆ విషయాన్ని వారు సినిమా సినిమా మొదలు పెట్టె ముందు తెలుపుతామని అన్నారు. కానీ ఈ లోపునే ఆ స్టార్ హీరో ఎవరు అన్నది బజ్ వచ్చేసింది. ఈ చిత్రంలో ప్రభాస్ కు ప్రతినాయకునిగా అక్కడి స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటించనున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. మరి ఇది నిజం అయితే ఇద్దరికీ సినిమాలో సన్నివేశాలు వేరే రేంజ్ లో ఉంటాయి. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.