తమిళంలో ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రంగా తెరకెక్కిన 3BHK తెలుగులోనూ రిలీజ్ కానుంది. ఈ సినిమాను శ్రీ గణేష్ డైరెక్ట్ చేయగా ఈ సినిమాలో సిద్ధార్థ్, శరత్ కుమార్, దేవయాని, మీతా రఘునాథ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమాకు తమిళ హీరో శింబు తాజాగా రివ్యూ ఇచ్చాడు.
తమిళంలో ఈ సినిమాను చూసిన శింబు, ఇదొక చక్కటి ఫీల్ గుడ్ మూవీ అని.. ఒక ఎమోషనల్ జర్నీకి తీసుకెళ్లే చిత్రంగా 3BHK ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆయన తెలిపాడు. ఇక ఈ సినిమాలో సిద్ధార్థ్, శరత్ కుమార్ చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చారని ఆయన తెలిపాడు. ఓవరాల్‌గా ఈ సినిమాకు శింబు ఇంప్రెస్ అయ్యాడని చెప్పుకొచ్చాడు.
దీంతో తమిళంలో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక తెలుగులోనూ మంచి ఆసక్తి క్రియేట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.