‘డకాయిట్’ నుండి శ్రుతి బయటకు వెళ్లడంపై అడివి శేష్ కామెంట్స్

‘డకాయిట్’ నుండి శ్రుతి బయటకు వెళ్లడంపై అడివి శేష్ కామెంట్స్

Published on Jul 2, 2025 2:00 AM IST

టాలీవుడ్ హీరో అడివి శేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డకాయిట్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను పూర్తి యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. షేనియల్ డియో డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

అయితే, ఈ సినిమాలో తొలుత అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా సెలెక్ట్ అయింది. ఆమె కొంతవరకు షూటింగ్ కూడా జరుపుకుంది. కానీ, ఆమె కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుంచి వాకౌట్ చేసింది. అయితే, డకాయిట్ చిత్ర యూనిట్‌తో శ్రుతికి చెడిన కారణంగా ఆమె ఈ సినిమా నుంచి వెళ్లిపోయిందనే టాక్ చక్కర్లు కొట్టాయి. కానీ, ఈ సినిమా కోసం శ్రుతి తన డేట్స్ అడ్జస్ట్ చేయడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొందని.. ఆమె మరోవైపు కూలీ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉండటంతో ఈ సినిమాకే డేట్స్ కేటాయించలేకపోయిందని అడివి శేష్ తెలిపాడు.

కేవలం ఈ కారణంతోనే శ్రుతి ఈ సినిమా నుంచి వాకౌట్ చేసినట్లు అడివి శేష్ తెలిపాడు. ఇక ఇప్పుడు మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాలో వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు