శిరీష్ కామెంట్స్‌పై దిల్ రాజు క్లారిటీ.. ఏమన్నారంటే..?

శిరీష్ కామెంట్స్‌పై దిల్ రాజు క్లారిటీ.. ఏమన్నారంటే..?

Published on Jul 1, 2025 7:01 PM IST

టాలీవుడ్ ప్రెస్టీజియస్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతల్లో ఒకరైన శిరీష్ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ సరికొత్త వివాదానికి దారి తీశాయి. రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ డిజాస్టర్ తర్వాత ఆ సినిమా హీరో, డైరెక్టర్ ఎవరూ తమకు ఫోన్ చేయలేదని ఆయన తెలిపారు. అంతేగాక, ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో తమ పని అయిపోయిందని అనుకున్నామని.. అయితే సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో తిరిగి నిలదొక్కుకున్నామని ఆయన అన్నారు.

శిరీష్ చేసిన కామెంట్స్ టాలీవుడ్‌లో మెగా ఫ్యాన్స్‌ను ట్రిగ్గర్ చేశాయి. దీంతో దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి రాబోయే సినిమాలకు తమ సపోర్ట్ ఉండబోదంటూ సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక తాజాగా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు దిల్ రాజు. ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో శిరీష్ చేసిన కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చారు. ‘గేమ్ ఛేంజర్’ చిత్రానికి నిర్మాతగా తాను జర్నీ చేశానని.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి శిరీష్ నిర్మాతగా జర్నీ చేశాడని.. అందులోనూ ఆయన డిస్ట్రిబ్యూషన్ ఎక్కువగా చూసుకుంటాడు కాబటి.. ఆ కోణంలో శిరీష్ మాట్లాడారని.. ఆయనకు ఇది తొలి ఇంటర్వ్యూ కావడం కూడా ఒక కారణంగా దిల్ రాజు చెప్పుకొచ్చారు.

మెగాస్టార్ చిరంజీవితో, రామ్ చరణ్‌తో తమకు మంచి రిలేషన్ ఉందని.. భవిష్యత్తులోనూ వారితో సినిమాలు చేస్తామని దిల్ రాజు తెలిపారు. మొత్తానికి శిరీష్ చేసిన కామెంట్స్ పై జరుగుతున్న రచ్చను చల్లార్చే ప్రయత్నం చేశారు దిల్ రాజు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు