బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్ నుంచి రాబోతున్న నెక్స్ట్ స్పై యాక్షన్ చిత్రం ‘వార్-2’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శఖుడు అయాన్ ముఖర్జీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై కేవలం సౌత్‌లో మాత్రమే కాకుండా నార్త్‌లోనూ భారీ హైప్ క్రియేట్ అయ్యింది.
ఇక ఈ సినిమాను తెలుగులో ఎవరు రిలీజ్ చేస్తారా.. అనే ఉత్కంఠకు తెరదించారు నిర్మాతలు. ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం టాలీవుడ్‌లోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు అన్ని పోటీ పడ్డాయి. అయితే, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నాగవంశీ ఈ చిత్ర తెలుగు రైట్స్‌ను మంచి ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఆయన దాదాపు రూ.90 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
దీంతో ఈ సినిమాపై హైప్ మరింత పెరిగింది. ఈ సినిమాకు పోటీగా రానున్న ‘కూలీ’ చిత్ర తెలుగు రైట్స్ రూ.50 కోట్లకు విక్రయం అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ రెండు సినిమాల్లో బాక్సాఫీస్ దగ్గర ఏది విజయాన్ని అందుకుంటుందా అనే అంశం ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ఆగస్టు 14న బాక్సాఫీస్ దగ్గర వార్ మామూలుగా ఉండదు అనేది వాస్తవం.