‘వార్ 2’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ పై లేటెస్ట్ బజ్!

‘వార్ 2’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ పై లేటెస్ట్ బజ్!

Published on Jul 1, 2025 11:00 PM IST

బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అలాగే మన టాలీవుడ్ నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లు ప్రధాన పాత్రల్లో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమే “వార్ 2”. ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ఇపుడు అంతిమ దశలో ఉంది. అయితే ఈ సినిమా నుంచి మొదటి పాట కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా దీనిపై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది.

దీని ప్రకారం మేకర్స్ ఫస్ట్ సింగిల్ గా ఓ రొమాంటిక్ డ్యూయెట్ ని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. హృతిక్ ఇంకా కియారాపై కొనసాగే సాంగ్ అన్నట్టు ఇది టాక్. ఇక ఈ సాంగ్ ఎప్పుడు విడుదల అంటే ఈ జూలై 10న రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్టుగా వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాలి. ఇక ఈ సినిమాకి ప్రీతమ్ సంగీతం అందిస్తుండగా యష్ రాజ్ ఫిల్మ్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు