పెద్ద ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్న శ్రీకాంత్

పెద్ద ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్న శ్రీకాంత్

Published on Oct 17, 2012 3:24 AM IST


ప్రముఖ నటుడు శ్రీకాంత్ పెద్ద ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు నెల క్రితం ఈ సంఘటన మలేసియాలో జరిగింది. కాని ఈ విషయాన్నీ కొన్ని గంటల ముందు శ్రీకాంత్ ట్విట్టర్లో తెలిపారు. “షాడో చిత్రీకరణలో పెద్ద ప్రమాదం తప్పింది ఇది నాకు పునర్జన్మలా ఉంది” అని శ్రీకాంత్ అన్నారు. శ్రీకాంత్ చేజ్ సన్నివేశాల్లో పాల్గొనే సమయంలో ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తుంది. విక్టరి వెంకటేష్ మరియు తాప్సీలు ప్రధాన తారలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ మరియు మధురిమలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పరుచూరి కిరీటి నిర్మిస్తుండగా ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సంఘటనలో శ్రీకాంత్ కి గాయలేమి కాలేదు అయన క్షేమంగానే ఉన్నారు.

తాజా వార్తలు