దండుపాళ్యం దర్శకుడితో శ్రీకాంత్

దండుపాళ్యం దర్శకుడితో శ్రీకాంత్

Published on Feb 25, 2013 5:00 PM IST

Srikanth-Dandupalyam

కన్నడ సూపర్ హిట్ మూవీ దండుపాల్య తెలుగులో దండుపాళ్యం పేరుతో విడుదలై ఇక్కడ కూడా మంచి కలెక్షన్లే సాధిస్తుంది. ఈ సినిమా విజయంతో దర్శకుడు శ్రీనివాస రాజుకి భారీ ఆఫర్స్ వచ్చాయి. శ్రీకాంత్ హీరోగా భారీ వ్యయంతో ఒక సినిమా శ్రీనివాస రాజు ఒక సినిమా డైరెక్ట్ చేయనున్నాడు. శ్రీకాంత్ తో మహాత్మ సినిమా నిర్మించిన సి.అర్ మనోహర్, విజయ్ కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. గోల్డెన్ లయన్ ఫిల్మ్స్, ఇ స్క్వేర్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతుంది. జూన్ నెలలో సెట్స్ మీదకి వెళ్లనున్న ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.

తాజా వార్తలు