పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మరో అవైటెడ్ చిత్రమే “ఓజి”. తన ఫ్యాన్ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్ డ్రామా పట్ల హైప్ ఇపుడు పీక్స్ లో ఉంది. మరి అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా నుంచి ఏ చిన్న అంశం కూడా డిజప్పాయింట్ చేయకుండా వస్తుంది. అయితే ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా వచ్చిన గ్లింప్స్ విషయంలో ఒక్క వ్యక్తికే క్రెడిట్ ని ఫ్యాన్స్ అందిస్తున్నారు.
అతను మరెవరో కాదు సంగీత దర్శకుడు థమన్. తన విషయంలో ఎప్పుడు నుంచో అభిమానులు ఎగ్జైటెడ్ గానే ఉన్నారు. కానీ లేటెస్ట్ గా వచ్చిన గ్లింప్స్ స్కోర్ దెబ్బకి థియేటర్స్ లో నెక్స్ట్ లెవెల్ ఫీస్ట్ అని ఫిక్స్ అయ్యిపోయారు. మొత్తానికి మాత్రం థమన్ కి స్పెషల్ అప్లాజ్ ఈ గ్లింప్స్ కి దక్కింది. ఇదే మూమెంటం కొనసాగితే మాత్రం థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఆడియెన్స్ కి ఫీస్ట్ ఇస్తుంది అని చెప్పవచ్చు.