మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో చేస్తున్న గ్లొబ్ ట్రాటింగ్ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. మహేష్ బాబు కెరీర్లో 29వ సినిమాగా ప్లాన్ చేస్తున్న ఈ బిగ్ ప్రాజెక్ట్ ఎనలేని హైప్ ని సొంతం చేసుకుంది.
లేటెస్ట్ గా ఇండియన్ సినిమా నుంచి ఏ సినిమా కూడా విడుదల చేయని విధంగా ఏకంగా 120 దేశాల్లో మహేష్ 29వ చిత్రం విడుదల కాబోతుంది అని వచ్చిన టాక్ సెన్సేషనల్ గా మారింది. ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్ కూడా హాలీవుడ్ లెవెల్లోనే ప్లాన్ చేస్తున్నారు.
దీనిని కూడా అంతే గ్రాండ్ గా రిలీజ్ ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ అప్డేట్ నుంచే ఇంటర్నేషనల్ మార్కెట్ పై కన్నేసిన ఈ ప్రాజెక్ట్ రాజమౌళి ప్రాజెక్ట్ కి ఆన్సర్ ఇచ్చే లెవెల్లోనే ఉంటుందో లేదో అనేది కాలమే నిర్ణయించాలి.