తెలుగులో రానున్న స్పెషల్ 26

తెలుగులో రానున్న స్పెషల్ 26

Published on Feb 27, 2013 9:35 PM IST

Special-26
తెలుగులో రీమేకుల పరంపర ఆగేలా లేదు. ఈ జాబితాలో ఇప్పుడు నీరజ్ పాండే దర్శకత్వం వహించి అక్షయ్ కుమార్ మరియు కాజల్ జంటగా నటించిన ‘స్పెషల్ 26’ కుడా చేరింది. ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా హిందీలో కమర్షియల్ గా సక్సెస్ కావడమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ సినిమా 80లలో కొంతమంది నకిలీ సి.బి.ఐ ఆఫీసర్లుగా బొంబాయిలోని ఒక నగల షాపుని దోచుకున్న యాదార్త సంఘటనల ఆధారంగా రూపొందింది.

ఈ స్టొరీ లైన్ నచ్చి తమిళ్ లో ‘వెట్టై’, ‘పైయ్య’ చిత్రాల దర్శకుడు లింగుస్వామి తిరుపతి బ్రదర్స్ ప్రొడక్షన్ పేరు మీద ఈ ‘స్పెషల్ 26’ రీమేక్ హక్కులు కొనుక్కున్నారు. ఈ సినిమాని తెలుగు, తమిళంలో తీస్తారు. ఈ చిత్రానికి సంబందించిన ప్రధాన తారాగణం, దర్శకత్వం మొదలైన వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

తాజా వార్తలు