సోనూసూద్ మంచి మనసుకి మరో ఉదాహరణ.

సోనూసూద్ మంచి మనసుకి మరో ఉదాహరణ.

Published on Jun 14, 2020 9:35 PM IST

లాక్ డౌన్ కారణం దేశంలో దుర్భర పరిస్థితులు ఏర్పడగా అనేక మంది ఇబ్బందులపాలయ్యారు. ముఖ్యంగా వలస కూలీల పరిస్థితి దారుణంగా తయారైంది. ఇతర రాష్ట్రాలలో చిక్కుకుపోయిన కూలీలు పనులు లేక, ఇంటికి వెళ్లే దారిలేక, తినడానికి తిండి లేక అల్లాడిపోయారు. వందల కిలోమీటర్లు పిల్లా జల్లతో రోడ్లు పట్టుకొని సొంత ఊర్లకు చేరే ప్రయత్నం చేశారు. వారి ఆ బ్రతుకు ప్రయాణంలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది.

ఐతే ఇలా ఇబ్బంది పడుతున్న అనేక మంది వలస కూలీలను వారి సొంత గ్రామాలకు చేర్చే ప్రయత్నం చేశారు నటుడు సోనూ సూద్. వందల బస్సులు, ప్రత్యేక రైళ్ల ద్వారా వారిని ఇంటికి చేర్చి వాళ్ళ పాలిట దేవుడయ్యాడు. ఇక సోనూ సూద్ మంచి తనం అతన్ని హీరోని చేసింది. తాజాగా ఆయన లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ఓ సీనియర్ నటుడికి ఆర్థిక సాయం చేశారు. మున్నా భాయ్ ఎమ్ బి బి ఎస్ చిత్రంలో నటించిన సురేంద్ర రాజన్ కు ఆర్థిక సాయం చేసి అండగా నిలిచాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు