సోనూ సూద్ సినిమాలకు కొన్ని వారాలపాటూ విరామం తీసుకోనున్నాడు. ఇటీవలే దుబాయ్ లో క్రికెట్ మ్యాచ్ ఆడుతుండగా తీవ్రంగా గాయపడిన అతన్ని వెంటనే హాస్పటల్ కి తరలించారు. గాయం అంత పెద్దది కాకపోయినా తనని నటనుకు దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు. “2ప్లేట్లు మరియు 17 స్క్రూలు కలిసి నా విరిగిన చేతిని సెట్ చెయ్యడానికి సహాయపడతున్నాయి. కొన్ని సినిమాలను వదిలేసుకున్నందుకు బాధగా ఉందని” ట్విట్టర్లో పేర్కొన్నాడు.
ప్రస్తుతం సోనూ సూద్ నాగార్జున రాబోయే చిత్రం ‘భాయ్’ మరియు రామ్ చరణ్, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ‘జంజీర్’ తెలుగు వెర్షన్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలలో సోనూ సూద్ చాలా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నాడు. తన గాయం కారణంగా వీటిల్లో దేనిని వదులుకుంటాడో చూడాలి