శ్రీ హరి పాత్రలో సోనూ సూద్ మెప్పిస్తాడా


సిద్దార్థ్ మరియు త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రం 2005 లో విడుదలై ఘన విజయం సాదించింది. ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన ప్రభుదేవా ప్రస్తుతం ఈ చిత్రాన్ని హిందీలో రిమేక్ చేస్తున్నారని మరియు ఈ చిత్రంలో త్రిష పోషించిన పాత్రని హిందీలో శ్రుతి హాసన్ పోషిస్తోందని మేము ఇదివరకే తెలిపాము. తెలుగు వెర్షన్ లో త్రిషకి అన్నయ్య పాత్రలో శ్రీ హరి పోషించారు. ఈ పాత్ర శ్రీ హరికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రభుదేవా హిందీలో ఈ పాత్ర చేయడానికి సోనూ సూద్ ని ఎంపిక చేసారు. ఇప్పటివరకూ సిక్స్ పాక్ బాడీతో ఎంతో క్లాస్ లుక్ తో కనిపించిన సోనూ సూద్ ఒక రైతు పాత్రలో ఎలా కనిపించనున్నడా అనేదాని కోసం కొంత కాలం వేచి చూడాల్సిందే. టిప్స్ ఇండస్ట్రీ అధినేత రమేష్ తౌరాని కుమారుడు గిరీష్ తౌరాని ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ కి హీరోగా పరిచయమవుతున్నాడు. కుమార్ తరుణి స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version