ప్లాస్టిక్ సర్జరీతో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఒకప్పటి అందాల హీరోయిన్ ?


ఒకప్పుడు తమ అందంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న కొందరు హీరోయిన్లు కొన్నాళ్లకు ఫేడ్ అవుట్ అయిపోతుంటారు. సినిమా ఛాన్సులు పూర్తిగా తగ్గిపోతే లుక్స్ మీద శ్రద్ద పెట్టడం మానేసి గుర్తుపట్టలేనంతగా మారిపోతుంటారు. అలా మారిపోయిన హీరోయిన్లలో సోనియా అగర్వాల్ కూడ ఒకరు. ‘7/G బృందావన్ కాలనీ’ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయిన ఆమె ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా దర్శకుడు సెల్వ రాఘవన్ తో వివాహం ఆతర్వాత విడాకులు అంటూ వివాదాల్లో నలిగింది.

ఆ తర్వాత సినిమాలో ఆఫర్లు తగ్గడంతో ఫేడ్ అవుట్ అయిపోయింది. అడపాదడపా టీవీ ప్రోగ్రాంలలో మెరిసి ఇప్పుడిప్పుడే క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలు దక్కించుకుంటోంది. అయితే తాజాగా ఆమె తన ఇన్స్టాలో తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిలో ఆమె బాగా బరువు తగ్గి నాజూకుగా కనిపిస్తోంది. ముఖం కూడ చాలావరకు మారిపోయింది. ఆ ఫొటోలు చూసిన నెటిజన్లు సోనియా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని పూర్తిగా మారిపోయిందని, గుర్తుపట్టలేకున్నామని, అయినా ఇప్పుడు బాగుందని అంటున్నారు. ఆమె ఫోటోలు ప్రజెంట్ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నాయి. ప్రస్తుతం సోనియా ‘వామ్నురై’ అనే సినిమాలో నటిస్తోంది.

Exit mobile version