బాలకృష్ణ తన గురువంటున్న సోనాల్ చౌహాన్

బాలకృష్ణ తన గురువంటున్న సోనాల్ చౌహాన్

Published on Mar 21, 2014 4:00 PM IST

sonal-chauhan
లెజెండ్ సినిమాలో బాలకృష్ణ సరసన నటించిన నాయిక సోనాల్ చౌహాన్. ఈ సినిమా ఈ నెల 28న మనముందుకు రానుంది. ఈ సినిమా చేసినందుకు తాను చాలా ఆనందంగా వున్నానని, బాలకృష్ణ గారినుండి ఎన్నో ఉపయోగకరమైన అంశాలను తెలుసుకున్నానని ఈరోజు ప్రెస్ రిలీజ్ ద్వారా తెలిపింది

ఈ సినిమాలో తన నటనకు తప్పకుండా ప్రశంసలు వస్తాయని ఈ భామ ఆశిస్తుంది. సెట్ లో బృందమంతా తనకు ఇచ్చిన మర్యాద చాలా ఆనందాన్ని కలిగించిందని అందుకే ఇక్కడ మరిన్ని సినిమాలలో నటించడానికి సిద్దపడినట్లు తెలిపింది

బోయపాటి శ్రీను దర్శకుడు. అనీల్ సుంకర, గోపీచంద్, రామ్ ఆచంట ఈ సినిమాని 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ద్వారా నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతదర్శకుడు

తాజా వార్తలు