సామ్ ‘శుభం’ కి సాలిడ్ రెస్పాన్స్!

మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చాలా కాలం తర్వాత తెలుగులో నటిగా అలాగే నిర్మాతగా చేసిన మొదటి చిత్రమే “శుభం”. దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగులతో చేసిన ఈ చిత్రం రిలీజ్ కి ముందే మంచి బజ్ ని సొంతం చేసుకుంది. ఇలా మేకర్స్ తమకి ఉన్న నమ్మకంతో సినిమాకి ఏకంగా రెండు రోజులు ముందే ప్రీమియర్స్ ని తెలుగు రాష్ట్రాల్లో వేసుకోవడం విశేషం.

మరి ఇంట్రెస్టింగ్ గా ఈ ప్రీమియర్స్ నుంచి శుభం చిత్రానికి సాలిడ్ రెస్పాన్స్ రావడం జరిగింది. దాదాపు అన్ని పైడ్ ప్రీమియర్స్ ఫుల్స్ అవ్వడమే కాకుండా షోస్ అయ్యాక మంచి రెస్పాన్స్ ని కూడా ఈ చిత్రం ఆడియెన్స్ నుంచి అందుకుంది. దీనితో మే 9న ఫుల్ ఫ్లెడ్జ్ రిలీజ్ కి మాత్రం ఇది మంచి బూస్టప్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో యువ నటీనటులు హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి తదితరులు నటించగా కీడా కోలా, సినిమా బండి నటుడు రాగ్ మయూర్ కూడా నటించాడు.

Exit mobile version