ఎనర్జిటిక్ స్టార్ రామ్, తమన్నా జంటగా నటించిన ‘ఎందుకంటే ప్రేమంట’ చిత్ర ఆడియో ఆదివారం రోజున అన్నపూర్ణ స్టూడియోలో ప్రముఖుల చేతుల మీదుగా విడుదల చేసారు. సోమవారం నుండి ఈ చిత్ర ఆడియో మార్కెట్లో లభిస్తుండగా యువత నుండి ఈ మంచి స్పందన లభిస్తుంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఎందుకంటే ప్రేమంట ఆడియోలో కిక్కో గిక్కో, చిల్ అవుట్, నీ చూపులే పాటలు పాటలు యువతని బాగా ఆకర్షిస్తున్నాయి. రొమాంటిక్ లవ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం రామ్ కేరేర్లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కింది. కరుణాకరన్ గత చిత్రాలను మించే స్థాయిలో ఈ చిత్రం ఉంటుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల ద్వితీయార్ధంలో విడుదలవుతున్న ఈ చిత్రని ఆండ్రూ సినిమాటోగ్రఫీ అందించారు. ప్రముఖ నిర్మాత స్రవంతి రవి కిషోర్ ఈ చిత్రాన్ని స్రవంతి మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.