“ఉప్పెన”కు సాలిడ్ ఫిగరే ఎస్టిమేట్ చేస్తున్నారు!

“ఉప్పెన”కు సాలిడ్ ఫిగరే ఎస్టిమేట్ చేస్తున్నారు!

Published on Feb 12, 2021 8:06 PM IST


ఎప్పటి నుంచో యూత్ మరియు తెలుగు సినిమా ఆడియెన్స్ కూడా ఎదురు చూస్తున్న సినిమా “ఉప్పెన”. గత ఏడాది ఏప్రిల్ లో విడుదల కావాల్సిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈరోజు థియేటర్స్ లో పడింది. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఈ డెబ్యూ చిత్రం మొదటి షో నుంచే మంచి టాక్ ను అంచనాలకు తగ్గట్టుగానే తెచ్చుకుంది.

అయితే విడుదలకు ముందే భారీ హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం విడుదల అయ్యాక కూడా ఆ స్థాయి అంచనాలు అందుకునే సరికి ఈ సినిమా వసూళ్లు కోసం ఇప్పుడు ట్రేడ్ వర్గాలు మరియు జెనరల్ మూవీ ఫాలోవర్స్ లో టాక్ మొదలయ్యింది. ఓ డెబ్యూ చిత్రంగా పలు టార్గెట్స్ తో దిగిన ఈ చిత్రం డే 1 నుంచే కాకుండా ఓవరాల్ గా కూడా సాలిడ్ ఫిగర్స్ నే నమోదు చేసే అవకాశం ఉందని అంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, సుక్కు రైటింగ్స్ అలాగే మైత్రి మూవీ మేకర్స్ పెట్టిన ఎఫర్ట్స్ ఎంత వరకు మ్యాజిక్ చేస్తాయో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు