మెగా కాంపౌండ్ నుండి వస్తున్న మరొక హీరో వైష్ణవ్ తేజ్. డెబ్యూ చిత్రం ‘ఉప్పెన’తోనే మంచి హైప్ క్రియేట్ చేసుకున్నాడు. ఒక కొత్త హీరో మొదటి సినిమాకి ఈ స్థాయి క్రేజ్ అంటే విశేషమనే చెప్పాలి. మొదట పాటలతో ఆ తర్వాత టీజర్, ట్రైలర్లతో మంచి పాజిటివ్ బజ్ సంపాదించుకున్న ఈ సినిమా ఇప్పుడు పాత్రలు, సినిమా క్లైమాక్స్ లాంటి అంశాల విషయంలో చర్చల్లో నిలుస్తోంది. ప్రధానంగా ప్రతినాయకుడిగా, హీరోయిన్ తండ్రిగా నటించిన విజయ్ సేతుపతి పాత్ర మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సేతుపతి క్రేజ్ సినిమాకు బాగా ఉపయోగపడుతోంది.
ఇక సినిమా ముగింపు గురించి ఫిల్మ్ నగర్లో పెద్ద చర్చే నడుస్తోంది. స్టోరీ ఎండింగ్ విషాదంతం అంటున్నారు. ఈ విషాదపు ముగింపు ఇప్పటికే చాలా లవ్ స్టోరీల్లో వచ్చింది. కానీ ఇందులో మాత్రం ఆ విషాదాంతం కూడ రెగ్యులర్ ఫార్మాట్లో కాకుండా, ఇప్పటికవరకు ఏ సినిమాలోనూ చూపని విధంగా ఉంటుందట. అదే ప్రేక్షకుల్ని చలించిపోయేలా చేస్తుందని, అది గనుక వర్కవుట్ అయితే సినిమా విజయానికి తిరుగుండదని అంటున్నారు. ఆ ముగింపు మీద లీక్స్ ఉన్నా స్టోరీ స్పాయిలర్ అవుతుందనే ఉద్దేశ్యంతో ఇక్కడ రివీల్ చెయ్యట్లేదు. మరి ఆ ముగింపు ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ నెల 12 వరకు ఆగాల్సిందే.