పిక్ టాక్: ‘విశ్వంభర’ సెట్స్ లో చిరుతో నాగిని.. ఎగ్జైటింగ్ పోస్ట్ వైరల్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష, ఆషిక రంగనాథ్ లు హీరోయిన్స్ గా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ చిత్రమే “విశ్వంభర”. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా లేట్ అవుతూ వస్తున్న ఈ సినిమాలో రీసెంట్ గానే ఓ సాంగ్ షూటింగ్ కోసం బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ మౌని రాయ్ నటిస్తుంది అనే టాక్ బయటకి వచ్చింది. మొన్నీమధ్య ఓ వీడియో కూడా బయటకి వచ్చింది.

అయితే ఈ స్పెషల్ సాంగ్ కి సంబంధించి మౌని రాయ్ ఓ పోస్ట్ తో తన ఎగ్జైట్మెంట్ ని షేర్ చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి దిగిన పిక్ ని మొదటిగా షేర్ చేసిన నటి మౌని రాయ్ తన సోషల్ మీడియాలో నేరుగా విశ్వంభర సెట్స్ నుంచే మెగాస్టార్ తో కలిసి ఉన్న పిక్స్ ని షేర్ చేసుకుంది. మెగాస్టార్ తో డాన్స్ చేయడం ఎంతో ఆనందంగా మాత్రమే కాకుండా హానర్ గా కూడా భావిస్తున్నాను అని తెలిపింది.

అలాగే డాన్స్ మాస్టర్ గణేష్ ఆచార్య ఇతర విశ్వంభర టీం అందరికీ స్పెషల్ థాంక్స్ ని నాగిని చెప్పుకొచ్చింది. ఇలా ఈ క్రేజీ పోస్ట్ తో విశ్వంభర లో స్పెషల్ సాంగ్ పట్ల మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సాంగ్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేవి ఇంకా బయటకి రావాల్సి ఉంది.

Exit mobile version