పూరి జగన్నాధ్ తన కొడుకు ఆకాష్ పూరి కోసం తన డబ్బునే పెట్టుబడిగా పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఆకాష్ పూరి మొదటి సినిమాకే పూరికి లాస్ అని ఆ టైంలో రూమర్స్ వినపడ్డాయి. ప్రస్తుతం ఆకాష్ పూరి హీరోగా చేస్తోన్న కొత్త సినిమా ‘రొమాంటిక్’. కాగా ఈ సినిమాలో మాజీ హీరోయిన్ సిమ్రాన్ కూడా నటిస్తోంది. ప్రేక్షకులకు థ్రిల్ ఇవ్వడం కోసం ఈ విషయన్నిదాచారట.
సిమ్రాన్ ఈ చిత్రంలో హీరోయిన్ కేతిక శర్మకి తల్లిగా నటిస్తోందని.. అంటే ఆకాష్ పూరికి సిమ్రాన్ అత్తగా కనిపించబోతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
ఏమైనా మోడ్రన్ అత్త పాత్రలకు సిమ్రాన్ పర్ఫెక్ట్ ఆప్షన్. ఇక నూతన దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో వస్తోన్న ఈ ‘రొమాంటిక్’ సినిమాలో ఘాడమైన ప్రేమ సన్నివేశాలతో పాటు యూత్ ను బాగా ఆకట్టుకునే బోల్డ్ సీన్స్ అండ్ సాంగ్స్ ఉన్నాయని తెలుస్తోంది. మాఫియా నేపథ్యంలో జరిగే ఓ ప్రేమ కథగా వస్తోన్న ఈ సినిమాతోనైనా ఆకాష్ పూరికి హిట్ వస్తోందా.. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాల పై ఈ చిత్రాన్ని నిర్మించడానికి పూరి బాగా ఖర్చుపెట్టాడు.