సిద్దార్థ్ కొద్ది రోజుల పాటు ద్విభాషా చిత్రాలు చెయ్యాలని అనుకోవట్లేదనిపిస్తుంది. గతేడాది ఈ నటుడు 180 మరియు లవ్ ఫైల్యూర్ అనే రెండు ద్విభాషా చిత్రాలలో నటించారు. గతంలో ద్విభాషా చిత్రాలు చెయ్యటంలో కష్టాల గురించి సిద్దార్థ్ పలు మార్లు మాట్లాడారు ద్విభాషా చిత్రం లో ఒకే సన్నివేశాన్ని రెండు సార్లు చెయ్యాల్సి రావటం ఆయన్ని ఇబ్బంది పెట్టిన విషయంగా తెలుస్తుంది ” నందిని రెడ్డి చిత్రం తెలుగు మాత్రమే మరియు వెట్రిమారన్ చిత్రం తమిళ్ మాత్రమే ప్రస్తుతానికి ద్విభాషా చిత్రాలు లేవు” అని సిద్ద్దర్త్ ట్విట్టర్ లో అన్నారు. ప్రస్తుతం ఈయన తమిళనాడు లో తన మొదటి యాక్షన్ చిత్రం చిత్రీకరణ లో ఉన్నారు. మణికంఠన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వెట్రి మారన్ రచించి నిర్మిస్తున్నారు