శ్రుతి హాసన్ షాకింగ్ నిర్ణయం.. ఇక వాటికి దూరం!

స్టార్ బ్యూటీ శ్రుతి హాసన్ తన పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నం కొన్నిసార్లు వర్కవుట్ అవుతుంది.. మరికొన్ని సార్లు బోల్తా కొడుతుంది. అయితే, సోషల్ మీడియాలో మాత్రం శ్రుతి రేంజ్ వేరే లెవెల్. ఆమె పెట్టే ఫోటోలు, పోస్టులు.. విపరీతమైన క్రేజ్ ఈ అమ్మడి సొంతం.

కానీ, ఇప్పుడు అందరికీ షాకిస్తూ ఓ నిర్ణయం తీసుకుంది ఈ బ్యూటీ. కొద్దిరోజులు సోషల్ మీడియాకు తాను దూరంగా ఉండబోతున్నట్లు శ్రుతి తన ఇన్‌స్టా‌లో పోస్ట్ చేసింది. దీంతో అభిమానులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇప్పుడు ఎందుకని సడెన్‌గా సోషల్ మీడియాకు ఆమె దూరంగా వెళ్తుందని వారు ఆలోచిస్తున్నారు. ఏదేమైనా తాను కొద్ది రోజులు ఈ సోషల్ మీడియా లైఫ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.

ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఈ బ్యూటీ ‘కూలీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రజినీకాంత్ హీరోగా నటిస్తుండగా లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఆగస్టు 14న ఈ చిత్రం వరల్డ్‌వైడ్ రిలీజ్‌కు రెడీ అయింది.

Exit mobile version