ఖరారైన ‘శివ తాండవం’ విడుదల తేదీ


‘నాన్న’ లాంటి ప్రయోగాత్మక సినిమా తర్వాత మరోసారి విలక్షణ నటుడు విక్రమ్ మరియు యోగా బ్యూటీ అనుష్క జంటగా రాబోతున్న చిత్రం ‘శివ తాండవం’. ఈ చిత్రంలో విక్రమ్ అంధుడి పాత్రను పోషించారు. ఎ.ఎల్ విజయ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతి బాబు, అమీ జాక్సన్ మరియు లక్ష్మీ రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఈ నెల (సెప్టెంబర్) 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని మరియు ఈ చిత్ర ఆడియోను కూడా త్వరలోనే విడుదల చేస్తామని ఈ చిత్ర నిర్మాత సి. కళ్యాణ్ తెలియజేసారు. ఈ చిత్రానికి జి.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఇప్పటికే తమిళంలో విడుదలైన ఈ చిత్ర ఆడియోకి మంచి స్పందన లబిస్తోంది

Exit mobile version