2026లో నాలుగు పై కన్నేసిన శర్వానంద్..?

హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన గత చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో విజయం అందుకోలేకపోయాయి. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని శర్వా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’, ‘బైకర్’ చిత్రాలను ముందుగా పూర్తి చేయాలని శర్వా భావిస్తున్నాడు.

ఇక ఈ రెండు సినిమాలను 2026లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ కూడా రెడీ అవుతున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు సంపత్ నంది డైరెక్షన్‌లో ‘భోగి’ అనే సినిమాను కూడా వచ్చే ఏడాదిలో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు శర్వా. అయితే, ఈ మూడు సినిమాల తర్వాత మరో డైరెక్టర్ శ్రీను వైట్లతో ఓ సినిమా చేయాలని శర్వా నిర్ణయించుకున్నాడట.

అన్నీ అనుకున్నట్లు కుదిరితే, శ్రీను వైట్ల చిత్రాన్ని కూడా 2026లోనే రిలీజ్ చేయాలని ఈ హీరో ప్లాన్ చేస్తున్నాడట. మొత్తానికి 2026లో శర్వానంద్ నాలుగు సినిమాలను రిలీజ్ చేయాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు. మరి ఇందులో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతాయి అనేది వేచి చూడాలి.

Exit mobile version