కొత్త బ్యానర్ లాంచ్ చేసిన శర్వానంద్.. వారికి గోల్డెన్ ఛాన్స్!

కొత్త బ్యానర్ లాంచ్ చేసిన శర్వానంద్.. వారికి గోల్డెన్ ఛాన్స్!

Published on Sep 9, 2025 10:00 PM IST

ఫ్యామిలీ హీరోగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శర్వానంద్, కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. ఆయన ఓమీ (OMI) అనే పేరుతో ఒక ప్రొడక్షన్ హౌస్‌ను ప్రకటించారు. ఇది కేవలం బ్రాండ్ కాదు, భవిష్యత్తు తరాలకు సంబంధించి ఒక విజన్‌కి ఆరంభమని తెలిపారు.

మంచి ఉద్దేశ్యం, బాధ్యతతో కొత్త చాప్టర్‌ను మొదలుపెడుతున్నానని.. క్రియేటివిటీ, యూనిటీ, సస్టైనబిలిటీతో ఒరిజినల్ కథలను అందిస్తానని ఆయన చెప్పారు. ఇప్పటివరకు చెప్పని కథలను తన సంస్థ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తానని శర్వానంద్ స్పష్టం చేశారు.

నటులు, క్రియేటివ్ మైండ్స్‌ను కలిపే వేదికగా, అలాగే సినిమాలతో పాటు ఆరోగ్యం, ప్రకృతికి దగ్గరగా జీవనాన్ని ప్రోత్సహించే సంస్థగా ఓమీని తీర్చిదిద్దుతున్నట్టు తెలిపారు. ఈ సంస్థను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదగా ప్రారంభించారు.

తాజా వార్తలు