అమీ జాక్సన్ ని అక్కినేని అమలతో పోల్చిన శంకర్

అమీ జాక్సన్ ని అక్కినేని అమలతో పోల్చిన శంకర్

Published on Apr 1, 2014 9:15 PM IST

Amy-Jackson
శంకర్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘ఐ’ సినిమా దాదాపు పుర్తికావస్తుంది. ప్రస్తుతం ఈ దర్శకుడు సినిమా ప్రచార కార్యక్రమాలపై దృష్టిపెట్టాడు.
ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో విక్రమ్ సరసన అమీ జాక్సన్ నటించిన విషయం తెలిసినదే. ఆస్కార్ రవిచంద్ర్రన్ ఈ సినిమాను నిర్మించారు

ఇటీవలే విక్రమ్ నటనా ప్రతిభను పొగిడిన శంకర్ ఇప్పుడు అమీ జాక్సన్ ను పొగిడే పనిలో వున్నాడు. విదేశాలలో పుట్టిన ఈ సుందరి మోడలింగ్ రంగంలో ప్రావీణ్యం సాధించడంతో
ఇదే తనకు సరైన స్థానమని నిర్ణయించుకుంది. తమిళ స్వర ఉచ్చారనకై పలు శిక్షణా తరగతులను సైతం ఆశ్రయించింది. పాత్రలోకి తాను ప్రవేశించిన తీరు చూస్తే అక్కినేని అమల గుర్తొచ్చిందని
శంకర్ తెలిపాడు. ఐరిష్, బెంగాలిల మాతృకల మధ్య పుట్టిన అమల తన జీవితం మొత్తం ఇక్కడే గడిపింది

మనోహరుడు రూపంలో ఈ సినిమా తెలుగులో విడుదలకానుంది. ఈ చిత్రంలో విక్రమ్ పలు విభిన్న గెట్ అప్ లతో అలరించనున్నాడు. ఏ.ఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. పి.సి శ్రీరాం
సినిమాటోగ్రాఫర్

తాజా వార్తలు