గత రెండు రోజుల నుంచి మన దక్షిణాదిలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పేరు గట్టిగా మారుమోగుతుంది. మన ఇండియన్ జేమ్స్ కేమెరూన్ శంకర్ దర్శకత్వంలో చరణ్ నటించబోతున్నాడని ఆ భారీ ప్రాజెక్ట్ ఆల్ మోస్ట్ ఫిక్స్ అని కూడా టాక్ ఇప్పటికే ఒక రేంజ్ లో హల్ చల్ చేస్తుంది. దీనితో మెగా ఫ్యాన్స్ లో కూడా ఒకరకమైన ఆనందం. అయితే మరి ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ కు సంబంధించి ఒక అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని టాక్ ఊపందుకుంది.
మరి ఆ సాలిడ్ అప్డేట్ ఇప్పుడే వస్తుందా లేదా అన్నది ఆసక్తి గా మారింది. మరి ఇదిలా ఉండగా ఈ ప్రాజెక్ట్ ను టాలీవుడ్ టాప్ నిర్మాతలతో ఒకరైన దిల్ రాజు నిర్మాణం వహించడానికి రంగం మొత్తం సిద్ధం చేసారని కూడా తెలుస్తోంది. మరి ఈ మోస్ట్ అవైటెడ్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో శంకర్ ఎలాంటి సబ్జెక్ట్ ఎంచుకున్నారో, దానితో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి…