అజిత్ వైఫ్ షాలిని రీఎంట్రీ ఇస్తున్నారా ?

అజిత్ వైఫ్ షాలిని రీఎంట్రీ ఇస్తున్నారా ?

Published on Feb 13, 2021 3:00 AM IST


స్టార్ హీరో అజిత్ సతీమణి షాలిని ఒకప్పుడు స్టార్ కథానాయకిగా పేరు తెచ్చుకున్నారు. వివాహం తర్వాత ఆమె సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. 2001లో వచ్చిన ‘పిరియధ వరం వేండుం’ సినిమాలో నటించిన ఆమె ఆతర్వాత మరో సినిమాలో నటించలేదు. ఆమె వెండి తెర మీద కనబడి సుమారు 20 ఏళ్ళు కావొస్తోంది. ఈ రెండు దశాబ్దాల గ్యాప్ తర్వాత మళ్ళీ ఆమె సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారనే వార్త తమిళ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

స్టార్ డైరెక్టర్ మణిరత్నం ప్రస్తుతం ‘పొన్నియన్ సెల్వన్’ అనే భారీ బడ్జెట్ పిరియాడికల్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కార్తీ, విక్రమ్, జయం రవి, అమితాబ్, ఐశ్వర్యారాయ్, త్రిష లాంటి స్టార్ నటీనటులు నటిస్తున్నారు. ఇందులో ఒక అతిధి పాత్ర కోసం షాలిని ఎంచుకున్నట్టు, షాలిని కూడ మణిరత్నం సినిమాతో రీఎంట్రీ ఇవ్వడానికి సుముఖంగా ఉన్నట్టు చెబుతున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతమాత్రం నిజముందో తెలియాలంటే మాత్రం అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఆగాల్సిందే. ఇకపోతే గతంలో షాలిని మణిరత్నం తెరకెక్కించిన క్లాసికల్ మూవీ ‘సఖి’లో కథానాయకిగా నటించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు