ముంబైలో యాక్షన్ చేయనున్న వెంకీ


ఎప్పటికప్పుడు కొత్తరకమైన కథలను ఎంచుకోవడమే విక్టరీ వెంకటేష్ సక్సెస్ మంత్ర అని చెప్పుకోవచ్చు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘షాడో’ చిత్రంలో చాలా కాలం తర్వాత వెంకటేష్ పూర్తి యాక్షన్ కి ప్రాదాన్యమున్న పాత్రను చేస్తున్నారు. తాప్సీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ మరియు మధురిమ ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. గత కొన్ని రోజులుగా మలేషియాలో జరిగుతున్న షెడ్యూల్ పూర్తి చేసుకొని ఈ చిత్ర టీం ఇండియాకి తిరిగి వచ్చారు. ఈ లాంగ్ షెడ్యూల్ లో ఈ చిత్రానికి సంభందించిన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ ఆగష్టు 19 నుండి ముంబైలో జరగనుంది. కోనా వెంకట్ మరియు గోపి మోహన్ కథ అందించిన ఈ చిత్రాన్ని పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2013 సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version