విక్టరీ వెంకటేష్ సరికొత్త స్టైలిష్ అవతారంలో తెరకెక్కుతున్న ‘షాడో’ సినిమా షూటింగ్ ఒక్క పాట మినహా మిగతా అంతా పూర్తయ్యింది. యునైటెడ్ మూవీస్ బ్యానర్ పై పరిచూరి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మెహర్ రమేష్ డైరెక్టర్. వెంకటేష్ సరసన తాప్సీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో బాలన్స్ ఉన్న ఓ పాటని మార్చి 9 నుంచి హైదరాబాద్ లో వెంకటేష్ – తాప్సీ ల పై షూట్ చేయనున్నారు.
ఇదిలా ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే ప్రసాద్ లాబ్స్ లో డి.టి.ఎస్ మిక్సింగ్ పనులు మొదలయ్యాయి. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ సినిమా అనుకున్నదాని ప్రకారం ఈ నెల 7న విడుదల కావాలి కానీ ఈ మూవీ ఆడియో రైట్స్ హంగామా మ్యూజిక్ లేబుల్ వారు కొనుక్కోవడంతో వాయిదా పడింది. మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేయనున్నారు అనేది త్వరలోనే తెలియజేయనున్నారు.