డిసెంబర్లో రానున్న నయనతార అనామిక

డిసెంబర్లో రానున్న నయనతార అనామిక

Published on Oct 18, 2013 7:00 PM IST

Anamika
డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో, నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘అనామిక’. ఈ సినిమా డిసెంబర్ రెండవ వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ముందుగా ఈ సినిమాని దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేసారు, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల అనుకున్న టైంకి రాలేకపోయారు.

ఈ సినిమా బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కహాని’ సినిమాకి రీమేక్. ఎండేమోల్ ఇండియా బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. శేఖర్ కమ్ముల ఈ స్క్రిప్ట్ పై వర్క్ చేసి తెలుగు ప్రేక్షకులకి సరిపోయేలా మార్పులు చేర్పులు చేసారు. నయనతార టాలెంట్ ఉన్న నటి, తనలోని టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి ఇదొక సరైన అవకాశం అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు