కరోనా ప్రభావం ఇంకా ఉన్నప్పటికీ సినిమాల షూటింగ్స్ ను ప్లాన్ చేసుకుంటున్నారు మేకర్స్. కాగా ఈ రోజు నుండి సాయి తేజ్ కూడా తన ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీ షూటింగ్ ను మొదలుపెట్టాడు. ‘చిత్రలహరి, ప్రతిరోజూ పండగే’ లాంటి విజయాలతో మంచి సక్సెస్ ట్రాక్ లో ఉన్న తేజ్ ఆ తరహాలోనే ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే ఎంటెర్టైనర్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ఆ మధ్య రిలీజ్ అయిన మొదటి వీడియో సాంగ్ ‘నో పెళ్లి’ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.
ముఖ్యంగా సాంగ్ లో వరుణ్ తేజ్, రానా కనిపించి ఆకట్టుకొవడంతో సాంగ్ సోషల్ మీడియాలో అప్పుడు బాగా వైరల్ అయింది. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్.ఎల్.పి బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. ఈ చిత్రంతో సుబ్బు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నభా నటేశ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం పై మంచి అంచనాలు ఉన్నాయి.