ఇండియన్ ఎవర్గ్రీన్ బ్యూటీ శ్రీ దేవి దాదాపు 15 సంవత్సరాల తర్వాత కెమెరా ముందుకు వచ్చి చేసిన చిత్రం ‘ఇంగ్లీష్ వింగ్లీష్’. ఈ చిత్రం అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల కానుంది. శ్రీ దేవి ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఏ విషయం వల్ల ఈ చిత్రం క్లిక్ అవుతుందని అనుకుంటున్నారు? అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ‘ చాలా సింపుల్ కథాంశంతో తీసిన చిత్రం ఇది, అలాగే ఈ చిత్రంలో యూనివర్సల్ గా ఉండే ఒక సమస్యని చూపించాము. ఈ చిత్రంలో బావోద్వేగాలతో పాటు, దృడమైన మనస్తత్వం కలిగిన శశి అనే పాత్ర చేసాను. ప్రపంచలోని అందరి మాతృమూర్తులకు సంబంధం ఉండేలా శశి పాత్ర ఉంటుంది. ఆవిషయం అందరికీ నచ్చుతుందని’ ఆమె అన్నారు. గౌరీ షిండే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియా ఆనంద్ ఒక ముఖ్య భూమికను పోషించారు. ఈ చిత్ర హిందీ వెర్షన్లో అమితాబ్ బచ్చన్ అతిధి పాత్రలో కనిపించనుండగా, తెలుగు మరియు తమిళ వెర్షన్లలో అజిత్ అతిధి పాత్రలో కనిపించనున్నారు.
శశి పాత్రతో ప్రపంచంలోని ప్రతి తల్లికి సంబంధం ఉంటుందట
శశి పాత్రతో ప్రపంచంలోని ప్రతి తల్లికి సంబంధం ఉంటుందట
Published on Oct 3, 2012 12:00 PM IST
సంబంధిత సమాచారం
- ‘విశ్వంభర’ కోసం ఈ ఓటీటీ సంస్థ?
- ఘట్టమనేని హీరో కోసం విలన్‌గా మారిన మోహన్ బాబు..?
- మదరాసి సినిమా సెన్సార్ రిపోర్ట్.. రన్‌టైమ్ వివరాలు ఇవే..!
- ఓటీటీలో ‘కింగ్డమ్’కు షాకింగ్ రెస్పాన్స్.. ఇదెక్కడి ట్విస్ట్..!
- ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12: తెలుగు టైటాన్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ మ్యాచ్‌తో ప్రారంభం
- అఖండ 2 తప్పుకోవడంతో సింగిల్‌గా దిగుతున్న ఓజి.. ఇక రికార్డులు గల్లంతే..!
- ఎన్టీఆర్, నీల్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ బజ్!
- ‘హను మాన్’ స్ట్రాటజీ తోనే ‘మిరాయ్’.. వర్కౌట్ అయితే మాత్రం..!
- అఫీషియల్ : ‘అఖండ 2’ రిలీజ్ వాయిదా.. కొత్త డేట్ ఎప్పుడో..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘సుందరకాండ’ – ఆకట్టుకునే రోమ్ కామ్ డ్రామా
- సమీక్ష : ‘కన్యా కుమారి’ – మెప్పించని రొమాంటిక్ డ్రామా
- ఓటీటీలో పుష్ప 2 ని మించి ‘దేవర’?
- ‘మాస్ జాతర’ రిలీజ్ పై లేటెస్ట్ బజ్!
- ‘ఓజి’: ఈ విషయంలో కూడా స్పీడ్ పెంచాల్సిందేనా!
- ‘బిగ్ బాస్ 9’: మొత్తానికి కొత్త సీజన్ లాంచ్ డేట్ వచ్చేసింది!
- వీడియో : OG – సువ్వి సువ్వి లిరికల్ వీడియో (పవన్ కళ్యాణ్, సుజీత్)
- అఫీషియల్: ‘ది రాజా సాబ్’ మళ్ళీ వాయిదా.. కొత్త డేట్ వచ్చేసింది!