మహేష్ సినిమాకూ తప్పని లీకుల బాధలు.!

ఈ మధ్య కాలంలో మన టాలీవువ్డ్ భారీ చిత్రాలకు సంబంధించి ఎన్ని లీకులు బయటకొచ్చాయో సోషల్ మీడియా జనానికి బాగా తెలుస్తుంది. రాజమౌళి తెరకెక్కిస్తున్న “రౌద్రం రణం రుధిరం”, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న “పుష్ప” ఇంకా “వకీల్ సాబ్”చిత్రాల నుంచి మొదటి నాటి నుంచే లీకులు వచ్చేసాయి. అయితే వీటికి మేకర్స్ సరిగ్గా అడ్డుకట్ట వెయ్యలేకపోతున్నారు అన్నది వాస్తవం.

అయితే మరి ఇప్పుడు ఈ లీకుల బాధ నుంచి సూపర్ స్టార్ మహేష్ సినిమా “సర్కారు వారి పాట” కూడా తప్పించుకోలేకపోయింది. ఈ సినిమాలోని ఓ ఫైట్ సీక్వెన్స్ లోని ఆన్ లొకేషన్ ఫొటోలే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ చిత్ర యూనిట్ అయినా వీటికి సరైన అడ్డుకట్ట వేస్తారో లేదో చూడాలి. ఇక ఈ భారీ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version