సమ్మర్‌కి షిఫ్ట్ అయిన ‘సారంగపాణి జాతకం’

టాలీవుడ్ యాక్టర్ ప్రియదర్శి ప్రస్తుతం లీడ్ రోల్‌లో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే నాని ప్రొడ్యూస్ చేస్తున్న ‘కోర్ట్’ మూవీలో నటిస్తున్న ప్రియదర్శి, దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ తెరకెక్కిస్తున్న ‘సారంగపాణి జాతకం’ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాను గతంలోనే రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను వాయిదా వేశారు.

పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంపై మేకర్స్ నుంచి చాలా రోజుల వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో ఈ సినిమా ఇప్పట్లో రిలీజ్ అవుతుందా లేదా అనే సందేహం నెలకొంది. అయితే, తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ ఓ క్లారిటీ ఇచ్చారు.

సారంగపాణి జాతకం చిత్రాన్ని సమ్మర్ సీజన్‌లో రిలీజ్ చేస్తామని వారు ప్రకటించారు. దీంతో ఈ సినిమా వేసవి కానుకగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమాలో రూప కొడువయుర్ హీరోయిన్‌గా నటిస్తోండగా నరేష్, తనికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

Exit mobile version