సూర్య కోసం రెడ్ డ్రాగన్ కెమెరా వాడనున్న సంతోష్ శివన్

సూర్య కోసం రెడ్ డ్రాగన్ కెమెరా వాడనున్న సంతోష్ శివన్

Published on Oct 17, 2013 8:10 AM IST

Santosh-Sivan-brings-in-Red

ఇండియాలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్స్ లో సంతోష్ శివన్ ఒకరు. ప్రస్తుతం అడ్వాన్స్ రెడ్ డ్రాగన్ డిజిటల్ కెమెరా సిస్టంని ఇండియాలోనే మొట్ట మొదటి సారిగా ఉపయోగించనున్న సినిమాటోగ్రాఫర్ గా నిలవనున్నాడు. ఈ కెమెరా సిస్టంని లింగు స్వామి దర్శకత్వంలో సూర్య హీరోగా చేయనున్న సినిమా కోసం ఉపయోగించనున్నారు.

రెడ్ డ్రాగన్ కెమెరాలో హెచ్.డి కంటే ఎక్కువ క్లారిటీ కలిగిన 9X సెన్సార్ ని ఉపయోగించారు. దీనివల్ల చిన్న చిన్న వస్తువులని, విషయాలను కూడా క్లా క్లియర్ గా చూపించవచ్చు. ఈ డిజిటల్ సెన్సార్ 35ఎంఎం కన్నా క్లారిటీగా ఉంటుందని ఆశిస్తున్నారు. సమంత ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. సంతోష్ శివన్ టాలెంట్ ఏంటి అనేది తెలియాలంటే మీరు ఒకసారి ‘ఉరిమి’, ‘దిల్ సే’, ‘అశోక’, ‘తుపాకి’ మొదలైన సినిమాలను గుర్తుకు తెచ్చుకోండి. కావున ఇప్పుడు రెడ్ డ్రాగన్ కెమెరా వాడుతున్నారు కాబట్టి ఇంకా అదిరిపోయే విజువల్స్ ని ఆశించవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు