చిరు X సందీప్: ఒక్క పోస్ట్ తో మొత్తం షేక్.. మరి సినిమా ఎప్పుడు?

చిరు X సందీప్: ఒక్క పోస్ట్ తో మొత్తం షేక్.. మరి సినిమా ఎప్పుడు?

Published on Feb 4, 2025 9:02 AM IST

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇపుడు సాలిడ్ లైనప్ ని సెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మెగాస్టార్ చిరంజీవికి ఉన్న కల్ట్ ఫ్యాన్స్ లో పాన్ ఇండియా సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కూడా ఒకరు. చిరంజీవిని అడ్మైర్ చేసే సందీప్ రెడ్డి వంగ తన అభిమాన హీరో విషయంలో ఎన్నోసార్లు తన ప్రేమని వ్యక్తం చేసాడు.

అయితే రీసెంట్ గా తన నుంచి ఒక్క పోస్ట్ మాత్రం మొత్తం సోషల్ మీడియా సహా సినీ వర్గాల్లో కూడా ట్రెండింగ్ గా మారిపోయింది. తమ భద్రకాళి సినిమా ఆఫీస్ నుంచి షేర్ చేసుకున్న పిక్ లో మెగాస్టార్ చిరంజీవి తాలూకా మాస్ ఫ్రేమ్ దెబ్బతో సోషల్ మీడియాలో ఫైర్ మొదలైంది. మరి మెగాస్టార్ చిరంజీవి “ఆరాధన” సినిమా నుంచి ఒక సీన్ లో ఫ్రేమ్ ను సందీప్ వంగ కట్ చేసి ఫ్రేమ్ చేయించుకోవడం అనేది ఇతర మెగా అభిమానులని సైతం ఆశ్చర్యపోయేలా చేసింది.

దీనితో సందీప్ మెగాస్టార్ కి ఎలాంటి అభిమాని అనేది అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ హై మూమెంట్స్ ని మించిన హై తమకి కావాలని ఫ్యాన్స్ ఎప్పుడు నుంచో కోరుకుంటున్నారు. ఇద్దరి కాంబినేషన్లో ఒక సెన్సేషనల్ ప్రాజెక్ట్ చేసి అందరికీ సమాధానం ఇవ్వాలని అంటున్నారు. మరి ఈ చిరకాల కోరిక సందీప్, చిరులు తీరుస్తారా లేదా అనేది వేచి చూడాలి మరి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు