ప్రత్యేకం : సమంత సరికొత్త స్పోర్ట్స్ కారు

ప్రత్యేకం : సమంత సరికొత్త స్పోర్ట్స్ కారు

Published on Oct 25, 2012 1:19 PM IST


తన అందంతో కుర్రాకారుకి పిచ్చెక్కించిన అందాల భామ సమంత సరికొత్త ‘జాగుర్ ఎక్స్.ఎఫ్ ఆర్’ కారుని కొనుక్కున్నారు. ప్రస్తుతం సమంత ఈ స్పోర్ట్స్ మోడల్ కారులోనే విహరిస్తోంది మరియు సమంతకి ఎంత మంచి టేస్ట్ ఉందో అని ఈ కారుని బట్టే తెలుసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి యూత్ అంతా ఇష్టపడుతున్న స్పోర్స్ మోడల్ కారు జాగుర్ ఎక్స్.ఎఫ్.

ప్రస్తుతం సమంత తను హీరోయిన్ గా నటిస్తున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాకి డబ్బింగ్ చెబుతున్నారు. సమంత మొదటి సారిగా ఈ సినిమాకి తెలుగులో డబ్బింగ్ చెబుతున్నారు. డిసెంబర్ 21న విడుదల కానున్న ఈ సినిమాలో సమంత వాయిస్ మరియు తన తెలుగు డబ్బింగ్ ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. విక్టరీ వెంకటేష్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నదమ్ములుగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీ కాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు