పూర్తయిన సమంత ద్విభాషా చిత్రం

పూర్తయిన సమంత ద్విభాషా చిత్రం

Published on Oct 19, 2012 10:32 AM IST


‘ఏ మాయ చేసావే’ సినిమాతో చెన్నై ముద్దుగుమ్మ సమంతని తెలుగు తెరకు పరిచయం చేసి, ఆమె అందానికి అందరూ ముగ్దులయ్యేలా చేసిన దర్శకుడు గౌతం మీనన్. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా ఒక ద్విభాషా చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా తమిళ్లో ‘నీతానే ఎన్ పొన్ వసంతం’, తెలుగులో ‘ఏటో వెళ్ళిపోయింది మనసు’ అనే టైటిల్స్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ చిత్రానికి సంబందించిన టాకీ పార్ట్ పూర్తయ్యింది ఈ విషయాన్ని సమంత తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. తమిళ్లో జీవా హీరోగా నటిస్తుండగా, తెలుగులో నాని – సమంత మరోసారి జంటగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతమందించిన మాస్ట్రో ఇళయరాజా ఈ చిత్ర ఆడియోని ఎక్కువభాగం మెలోడీ పాటలతో నింపేశారు. సినీ ప్రేమికులు బాగా ఎదురుచూస్తున్న ఈ లవ్ ఎంటర్టైనర్ కోసం నవంబర్లో విడుదల కానుంది.

తాజా వార్తలు