సిరిమల్లె చెట్టుకి సమంత సొంత డబ్బింగ్

సిరిమల్లె చెట్టుకి సమంత సొంత డబ్బింగ్

Published on Oct 23, 2012 11:00 AM IST


టాలీవుడ్లో భారీ అంచనాలతో రానున్న మల్టీ స్టారర్ మూవీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో అందాల భామ సమంత కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకి సమంత స్వయంగా డబ్బింగ్ చెప్పనున్నారు. ఈ చిత్ర్రానికి సంబందించిన సమంత డబ్బింగ్ కార్యక్రమాలు ఈ రోజు మొదలయ్యాయి. తెలుగులో సమంత సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్న తొలి సినిమా ఇది. ఇప్పటి వరకూ సమంతకి డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి తన వాయిస్ అందించేది.

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ కి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు గత కొన్ని వారాల ముందు ప్రారంభమయ్యాయి. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నదమ్ములుగా నటిస్తున్నారు మరియు వీరికి జంటగా అంజలి మరియు సమంత నటిస్తున్నారు.

దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్రీ కాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తుండగా, మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు