విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ‘బాడీగార్డ్’ పెద్ద విజయం సాధించడం పట్ల వెంకటేష్ చాలా ఆనందంగా ఉన్నారు. ఈ చిత్రంలో వెంకటేష్ నటనకు చాలా పొగడ్తలు వస్తున్నాయి. సల్మాన్ ఖాన్ కూడా మెచ్చుకున్నారనీ సల్మాన్ తనకు మంచి స్నేహితుడని వెంకీ అన్నారు.
ఆయన ఈ సినిమా గురించి చాలా ఆసక్తి కనబరిచారని వ్యక్తిగతంగా కలిసి మెచ్చుకున్నారని అన్నారు. ఈ చిత్రానికి సంబందించిన ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ఈ రోజు వైజాగ్లో జరగనుంది. చిత్రం విజయం సాధించడం పట్ల నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ వేడుక చేయాలనీ నిర్ణయించారు.