‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ’ సినిమాలో దీపికతో పాటు మృణాల్, జాన్వీ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పుడు వీళ్లకు అదనంగా మరో హీరోయిన్ కూడా చేరిందట. బన్నీ-అట్లీ సినిమాలో ఓ ఐటెం సాంగ్ అనుకుంటున్నారు. ఈ సాంగ్ లో బన్నీతో కలిసి డాన్స్ చేయడానికి పూజాహెగ్డేను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. కమర్షియల్ ఎలిమెంట్స్ ను దృష్టిలో పెట్టుకుని అట్లీ ఈ సాంగ్ పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. మరి ఈ సాంగ్ లో పూజాహెగ్డే ఏ రేంజ్ లో అలరిస్తోందో చూడాలి.
అన్నట్టు రీసెంట్ గా కూలీ సినిమాలో పూజాహెగ్డే చేసిన స్పెషల్ సాంగ్ సూపర్ హిట్టయింది. కాగా ఇక బన్నీ కోసం అట్లీ ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను రెడీ చేశాడట. మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ చుట్టూ ఈ కథా నేపథ్యం సాగుతుందట. అన్నట్టు సన్ పిక్చర్స్ వారు ఈ ప్రాజెక్టును భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాలో నటించనున్న మిగిలిన నటీనటుల గురించి కూడా అప్ డేట్స్ ఇవ్వనున్నారు మేకర్స్.


