బలగం’ చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్నాడు వేణు యెల్డండి. త్వరలో తన తదుపరి చిత్రం ‘ఎల్లమ్మ’ షూటింగ్ ప్రారంభం కాబోతోందని వేణు తాజాగా తెలిపారు. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శకుడు వేణు దర్శించుకున్నారు. ఆదివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన కుటుంబసభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రం తెలంగాణ నేపథ్యంతో తెరకెక్కనున్నట్లు చిత్ర వర్గాల టాక్. ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. కాగా, ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ కేవలం హీరోగా మాత్రమే కాకుండా సంగీత దర్శకుడిగా కూడా అలరించబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.


