ఫ్యాన్స్‌ విమర్శల పై తమిళ డైరెక్టర్ స్పందన !

ఫ్యాన్స్‌ విమర్శల పై తమిళ డైరెక్టర్ స్పందన !

Published on Oct 26, 2025 8:30 PM IST

pa ranjith

దర్శకుడు పా.రంజిత్‌ తాను నిర్మించిన ‘బైసన్‌’ సినిమా సక్సెస్‌ మీట్‌లో చేసిన కామెంట్స్ నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారాయి. ఇంతకీ, రంజిత్‌ ఏం మాట్లాడారు అంటే.. ‘కాంతార’లాంటి సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నప్పుడు.. కొందరు కోలీవుడ్‌ ఫ్యాన్స్‌ ముగ్గురు తమిళ దర్శకులను తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. మేమే తమిళ చిత్ర పరిశ్రమను చెడగొట్టామని తిడుతూ ఉంటారు. గత రెండేళ్లలో 600కిపైగా సినిమాలు విడుదలయ్యాయి. ఎంత మంది తమిళ సినిమా స్థాయిని మరింత పెంచగలిగారు?’’ అని పా.రంజిత్‌ ప్రశ్నించారు.

పా.రంజిత్‌ కామెంట్లపై సోషల్‌ మీడియాలో సినీ ప్రియులు స్పందిస్తున్నారు. కొందరు ఆయన్ను సపోర్ట్‌ చేస్తుంటే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజనీకాంత్‌ హీరోగా తాను తెరకెక్కించిన ‘కబాలి’ మూవీపై వచ్చిన ట్రోల్స్‌పై కూడా రంజిత్‌ స్పందించారు. ‘విడుదలకు ముందే ‘కబాలి’ రూ.100 కోట్ల ప్రాఫిట్‌ ఇచ్చింది. స్క్రీన్‌ప్లేలో సమస్యలు ఉన్నాయి. నేను దానిని అంగీకరిస్తాను’ అని ఆయన తెలిపారు.

తాజా వార్తలు