విక్టరీ వెంకటేశ్ హీరోగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఐతే, ఈ సినిమాలో హీరోయిన్గా కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి ఎంపికైంది. ఐతే, తాజాగా వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం.. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టితో పాటు మరో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కూడా నటించబోతుందట. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకీ – ఐశ్వర్య రాజేష్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. మళ్లీ ఈ కలయికను త్రివిక్రమ్ ప్లాన్ చేయబోతున్నారు.
త్రివిక్రమ్, వెంకటేశ్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ తదితర చిత్రాలకు రచయితగా పని చేశారు. ఈ కాంబినేషన్లో మూవీని ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. వెంకటేశ్ హీరోగా రూపొందుతున్న ఈ 77వ చిత్రం టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. కాగా నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించబోతుందట. మరి ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని సాధిస్తుందో చూడాలి.


